1 00:00:02,000 --> 00:00:07,000 Downloaded from YTS.MX 2 00:00:08,000 --> 00:00:13,000 Official YIFY movies site: YTS.MX 3 00:00:35,786 --> 00:00:40,207 కోవిడ్-19 ఒక మహమ్మారి అని ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 4 00:00:40,290 --> 00:00:44,127 "ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి" అనే ఆదేశాన్ని నేను జారీచేస్తున్నాను. 5 00:00:44,211 --> 00:00:46,672 …దాదాపు నగరవాసులందరినీ పూర్తిగా 6 00:00:46,755 --> 00:00:49,424 ఇంట్లోనే ఉండమని ఆదేశిస్తున్నాను. 7 00:00:49,508 --> 00:00:53,262 ఈరోజు సాయంత్రం, నేను ఒక సూచన ఇవ్వాలి. 8 00:00:53,345 --> 00:00:55,264 మీరు ఇంట్లోనే ఉండాలి. 9 00:00:57,558 --> 00:01:02,354 మార్చి 2020. ప్రాణాంతక వైరస్ ప్రపంచం మొత్తం పాకింది. 10 00:01:02,437 --> 00:01:04,982 ఉండగలిగితే ఇంట్లోనే ఉండండి 11 00:01:05,065 --> 00:01:08,819 రాత్రికి రాత్రే, మన జీవితాలకు అంతరాయం కలిగింది. 12 00:01:14,533 --> 00:01:16,201 కానీ మనం ఆగగానే... 13 00:01:17,536 --> 00:01:22,583 ప్రకృతి ప్రపంచంలో చెప్పుకోదగ్గ మార్పులు మొదలయ్యాయి. 14 00:01:25,919 --> 00:01:27,546 స్వచ్ఛమైన గాలి. 15 00:01:29,923 --> 00:01:31,550 శుభ్రమైన నీరు. 16 00:01:33,135 --> 00:01:38,974 దశాబ్దాలుగా చూడని పద్ధతుల్లో జంతువులు వృద్ధి చెందడం ప్రారంభించాయి. 17 00:01:41,894 --> 00:01:46,607 ఐదు ఖండాల్లో లాక్ డౌన్ ప్రారంభం నుండీ చిత్రీకరణ చేపట్టి... 18 00:01:48,692 --> 00:01:52,154 ప్రకృతి అసాధారణ స్పందనను మేము రికార్డు చేశాం. 19 00:02:01,121 --> 00:02:04,833 తమ పిల్లలతో సముద్రంలో భారీ జీవులు నూతన మార్గాల్లో సంప్రదించడం దగ్గర నుండి... 20 00:02:08,920 --> 00:02:13,675 తమ కూనలు మనుగడ సాగించే అవకాశాలను చిరుతలు రూపాంతరం చేసుకోవడం… 21 00:02:14,343 --> 00:02:17,429 తల్లి కావడానికి ఇంతకు మించిన సమయం లేదు. 22 00:02:18,430 --> 00:02:24,019 రికార్డు బ్రేకింగ్ స్థాయిలో పెంగ్విన్ ల బ్రీడింగ్ సీజన్ వరకూ. 23 00:02:26,939 --> 00:02:32,152 వన్యప్రాణుల జీవితాల్లో, వాటి ప్రపంచంలో మనిషి ప్రమేయం తగ్గితే 24 00:02:32,778 --> 00:02:37,199 ఎలాంటి మార్పులు జరుగుతాయో తొంగి చూడడానికి ఇదొక ప్రత్యేక అవకాశం. 25 00:02:37,950 --> 00:02:41,578 భారీ పరిమాణాల్లో జరిగిన ప్రపంచవ్యాప్త ప్రయోగం ఇది. 26 00:02:43,163 --> 00:02:47,459 ఇది భూమి మారిన సంవత్సరం. 27 00:03:00,222 --> 00:03:04,351 వ్యాఖ్యాత డేవిడ్ అటెన్బరో 28 00:03:05,894 --> 00:03:11,483 లాక్ డౌన్ మొదలైన గంటలలోగా, ఎక్కువమంది నిశ్శబ్దాన్ని గమనించే ఉంటారు. 29 00:03:11,567 --> 00:03:12,818 రేడియో సిటీ మ్యూజిక్ హాల్ 30 00:03:14,236 --> 00:03:19,199 ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ శబ్ద కాలుష్యం 70% వరకూ తగ్గిపోగా, 31 00:03:19,283 --> 00:03:22,452 కొత్త శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి... 32 00:03:25,581 --> 00:03:26,999 ...పక్షి పాట. 33 00:03:31,503 --> 00:03:33,547 శాన్ ఫ్రాన్సిస్కో యు.ఎస్.ఎ 34 00:03:33,630 --> 00:03:35,257 మెట్రో జనాభా 47 లక్షలు 35 00:03:35,340 --> 00:03:37,426 ఈ వైట్ క్రౌన్డ్ పిచుకలు 36 00:03:37,509 --> 00:03:41,346 ఆశ్చర్యకరమైన పనిచేస్తూ నిశ్శబ్దానికి అలవాటు పడుతున్నాయి. 37 00:03:43,640 --> 00:03:46,476 గోల్డెన్ గేట్ బ్రిడ్జి సమీపంలో నివసించే 38 00:03:46,560 --> 00:03:50,480 వీటి పాట కార్ల హోరులో వినిపించకుండా పోయింది. 39 00:03:52,482 --> 00:03:57,362 కానీ ప్రస్తుతం ఇక్కడి ట్రాఫిక్ 1950లలో ఉన్నంత తక్కువ స్థాయికి చేరడంతో, 40 00:03:58,614 --> 00:04:04,244 ఈ పిచ్చుకలు జతకోసం చేసే శబ్దాలలో కొత్త రాగాలు కనిపెట్టి పరిశోధకులు అబ్బురపడ్డారు. 41 00:04:06,788 --> 00:04:11,877 కాబట్టి, కొన్నేళ్ళపాటు ఈ పక్షులకు మంచి బ్రీడింగ్ సీజన్ ఉంటుందనే ఆశించవచ్చు. 42 00:04:17,548 --> 00:04:20,552 తగ్గింది కేవలం శబ్ద కాలుష్యం మాత్రమే కాదు. 43 00:04:22,304 --> 00:04:28,310 ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం తగ్గిన వేగం ఊహించనిది. 44 00:04:30,229 --> 00:04:31,438 కొద్ది రోజులలోనే, 45 00:04:31,522 --> 00:04:36,944 40 ఏళ్ళలో ఎన్నడూ లేని ఉత్తమమైన గాలి నాణ్యతని లాస్ ఏంజిల్స్ చవిచూసింది. 46 00:04:39,112 --> 00:04:44,243 చైనా అంతటా, వాతావరణంలో విష వాయువుల స్థాయులు సగానికి పడిపోయాయి. 47 00:04:46,245 --> 00:04:52,125 ప్రపంచంలోనే ప్రమాదకరస్థాయిలో కాలుష్యం బారినపడిన కొన్ని ప్రాంతాలున్న ఇండియాలో... 48 00:04:53,585 --> 00:04:56,213 లాక్ డౌన్ విధించిన కేవలం 12 రోజుల్లోనే... 49 00:04:56,713 --> 00:04:59,216 జలంధర్ - ఇండియా జనాభా 10 లక్షలు 50 00:04:59,299 --> 00:05:01,510 ...ఒక ఉత్కంఠభరితమైన దృశ్యం ప్రత్యక్షమైంది. 51 00:05:01,593 --> 00:05:04,471 మేము ఉదయం టిఫిన్ చేయడానికి టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాం, 52 00:05:04,555 --> 00:05:06,014 అప్పుడు మా నాన్న హడావుడిగా అక్కడికి వచ్చారు. 53 00:05:06,098 --> 00:05:07,391 అన్షుల్ చోప్రా 54 00:05:07,474 --> 00:05:10,060 అప్పుడాయన, "డాబా మీదికి రండి. పర్వతాలు కనిపిస్తున్నాయి" అన్నారు. 55 00:05:10,143 --> 00:05:12,521 ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ అన్షుల్ 56 00:05:12,604 --> 00:05:15,858 ఈ హడావుడి దేనిగురించో చూద్దామని డాబా పైకి వెళ్ళాడు. 57 00:05:16,817 --> 00:05:19,236 జనం తమ ఇళ్ళ పైకప్పుల మీద నుంచుని, 58 00:05:19,319 --> 00:05:21,822 "వావ్. వావ్. పర్వతాలు. పర్వతాలు" అని అరుస్తున్నారు. 59 00:05:21,905 --> 00:05:24,533 నేను ఊపిరి బిగపట్టి, అటు చూశాను. 60 00:05:27,327 --> 00:05:30,455 ఆకాశం స్వచ్చంగా ఉండడంతో, జీవితంలో మొట్టమొదటిసారిగా, 61 00:05:30,539 --> 00:05:32,124 మేము హిమాలయాలను చూడగలిగాం. 62 00:05:33,041 --> 00:05:35,210 200ల కిలోమీటర్ల దూరంలో, 63 00:05:35,294 --> 00:05:38,046 30 ఏళ్ళనుండీ వాయు కాలుష్యం 64 00:05:38,130 --> 00:05:41,842 వెనుక దాగున్న భూమ్మీది ఎత్తైన పర్వతాలు, 65 00:05:41,925 --> 00:05:43,468 ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. 66 00:05:44,469 --> 00:05:45,888 నేను నా కళ్ళని నమ్మలేకపోయాను. 67 00:05:45,971 --> 00:05:49,725 ఇన్నాళ్ళ నుండీ కాలుష్యం వెనక హిమాలయాలు అక్కడే ఉన్నాయి. 68 00:05:51,935 --> 00:05:56,523 అన్షుల్ ఈ సందర్భాన్ని తీసిన ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. 69 00:05:57,608 --> 00:05:59,276 మనం ఆగిన మరుక్షణం, 70 00:05:59,359 --> 00:06:04,865 భూమి తిరిగి ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించిందనడానికి ఇదో స్పష్టమైన ఉదాహరణ. 71 00:06:10,495 --> 00:06:13,832 లాక్ డౌన్ వారాల తరబడి కొనసాగింది. 72 00:06:13,916 --> 00:06:16,043 4 వారాలు 73 00:06:16,126 --> 00:06:20,172 ప్రయాణ ఆంక్షలు మన కదలికల్ని మరింత కట్టడి చేశాయి. 74 00:06:21,131 --> 00:06:24,468 మీరు తీసుకోవాలని ప్లాన్ చేసిన సెలవుల్ని కాన్సిల్ చేసుకోండి. 75 00:06:24,551 --> 00:06:27,346 పాసెంజర్ల సంఖ్య, పాసెంజర్ల బుకింగ్స్ తగ్గిపోయాయి. 76 00:06:27,429 --> 00:06:29,556 విమాన ప్రయాణాలు దారుణంగా పడిపోయాయి. 77 00:06:29,640 --> 00:06:32,726 ప్రపంచవ్యాప్తంగా సుమారు 90% తగ్గిపోయాయి. 78 00:06:33,519 --> 00:06:35,187 2020 ఏప్రిల్ నెలలో 79 00:06:35,270 --> 00:06:40,526 గత ఏడాదితో అదే నెలతో పోల్చితే, అంతర్జాతీయ పర్యాటకులు 80 00:06:40,609 --> 00:06:42,778 11కోట్ల 40 లక్షలు తక్కువగా ఉన్నారు. 81 00:06:44,571 --> 00:06:50,827 స్పెయిన్ లో, పర్యాటకుల సంఖ్య 70 లక్షల నుండి సున్నాకు పడిపోయింది. 82 00:06:53,664 --> 00:06:55,666 ఫ్లోరిడా - యు.ఎస్.ఎ జనాభా రెండు కోట్ల 20 లక్షలు 83 00:06:55,749 --> 00:07:00,546 ఫ్లోరిడాలో వసంతకాల సెలవుల్లో జనంతో కిక్కిరిసిపోయి ఉండే బీచులు... 84 00:07:01,505 --> 00:07:03,131 వెలవెలబోయాయి. 85 00:07:06,385 --> 00:07:11,056 అంతరించే దశలో ఉన్న ఒక సముద్ర జీవి తన జనాభాను పెంచుకోవడానికి 86 00:07:11,139 --> 00:07:12,933 ఇది సరైన అవకాశమా? 87 00:07:21,066 --> 00:07:24,611 ప్రతి రెండు లేదా మూడేళ్ళకొకసారి ఆడ సముద్ర తాబేళ్లు 88 00:07:24,695 --> 00:07:27,739 గుడ్లు పెట్టేందుకు తాము పొదగబడిన 89 00:07:27,823 --> 00:07:29,658 తీరాలకు చేరుకుంటాయి. 90 00:07:32,077 --> 00:07:36,498 విశ్వవ్యాప్తంగా, తాబేళ్ల సంఖ్య వేగంగా తరిగిపోతూనే ఉంది, 91 00:07:36,582 --> 00:07:41,128 నిరంతరం బిజీగా ఉండే బీచుల్లో అవి గుడ్లు పెట్టడానికి ఇష్టపడకపోవడం అందుకు ఒక కారణం. 92 00:07:46,091 --> 00:07:47,301 కానీ ఈ ఏడాది... 93 00:07:48,760 --> 00:07:49,970 పరిస్థితి వేరుగా ఉంది. 94 00:07:53,140 --> 00:07:56,518 స్థానిక పరిశోధకులతో కలిసి పనిచేస్తున్న మా కెమెరామెన్ కు, 95 00:07:56,602 --> 00:07:59,938 జూనో బీచిలో చిత్రించే అదృష్టం దొరికింది... 96 00:08:01,190 --> 00:08:05,819 ప్రపంచంలోనే అత్యంత దట్టంగా లాగర్ హెడ్ తాబేళ్లు గుడ్లు పొదిగే ప్రాంతాల్లో ఇదొకటి. 97 00:08:10,866 --> 00:08:12,826 బ్రీడింగ్ సీజన్ ప్రారంభం కాగానే, 98 00:08:14,578 --> 00:08:18,081 తన జీవితంలో మొదటిసారిగా ఈ ఆడ తాబేలు 99 00:08:18,916 --> 00:08:21,752 ప్రశాంతంగా గుడ్లను పెట్టగలిగింది. 100 00:08:38,018 --> 00:08:40,020 రాబోయే మరికొద్ది వారాల్లో, 101 00:08:40,102 --> 00:08:42,397 మరిన్ని వందలాది తాబేళ్లు అదేపని చేస్తాయి. 102 00:08:47,694 --> 00:08:50,572 మనుషులు కల్పిస్తున్న విఘతాలే తాబేళ్ల పునరుత్పత్తికి 103 00:08:50,656 --> 00:08:53,659 పెద్ద సమస్యగా ఉన్నాయని ఎంతోకాలంగా భావించడం తెలిసిందే. 104 00:08:56,286 --> 00:09:00,374 కానీ ఈసారి మాత్రమే మొదటిసారిగా ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉందో 105 00:09:00,457 --> 00:09:02,459 పరిశోధించడం సాధ్యపడింది. 106 00:09:08,006 --> 00:09:11,260 ప్రతి ఉదయం, ఈ పరిశోధకుల బృందం 107 00:09:11,343 --> 00:09:14,972 గూళ్ళకు దారి తీసిన తాబేళ్ల అడుగుజాడలను లెక్కించారు. 108 00:09:18,350 --> 00:09:20,185 గత పదేళ్లుగా, 109 00:09:20,269 --> 00:09:23,438 లాగర్ హెడ్ తాబేళ్ళు పెట్టే గూళ్ళ సగటు 110 00:09:23,522 --> 00:09:26,650 సక్సెస్ రేటు కేవలం 40 శాతానికి పడిపోయింది. 111 00:09:27,401 --> 00:09:31,864 అవి బీచ్ పై విజయం సాధించగలిగాయా? 112 00:09:32,614 --> 00:09:34,783 మనుషులకు బీచుల్లో ప్రవేశం నిషేధించబడినపుడు, 113 00:09:34,867 --> 00:09:38,412 గతంలో ఎన్నడూ చూడని విధంగా వాటి సంఖ్య ఒక్కసారిగా 61 శాతానికి పెరిగింది. 114 00:09:38,495 --> 00:09:39,955 డాక్టర్ జస్టిన్ పెర్రల్ట్ తాబేళ్ల పరిశోధకుడు 115 00:09:41,707 --> 00:09:44,376 ఇదొక అసాధారణ పెరుగుదల. 116 00:09:51,425 --> 00:09:56,138 అదనంగా ఒక గూడు అంటే అర్థం మరో వంద లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు అని, 117 00:09:56,221 --> 00:10:00,767 అవి పెరిగి సొంతగా పునరుత్పత్తి చేయగల సామర్ధ్యం సంతరించుకుంటాయి. 118 00:10:03,145 --> 00:10:06,565 మనిషి అస్తిత్వంలోకి రాకముందు లక్షలాది ఏళ్ళుగా చేస్తూ వచ్చిన పనిని, 119 00:10:06,648 --> 00:10:09,109 బీచులు మూసేసేసరికి, 120 00:10:09,943 --> 00:10:13,614 ఈ జంతువులు మరింత విజయవంతంగా నిర్వర్తించగలిగాయి. 121 00:10:42,226 --> 00:10:44,478 ఆరు వేల కిలోమీటర్ల అవతల, 122 00:10:44,561 --> 00:10:46,355 అమెరికా పశ్చిమ తీరం వెంట... 123 00:10:49,900 --> 00:10:54,780 అలల అడుగున ప్రశాంతత భారీ సముద్రజీవులకు 124 00:10:55,697 --> 00:10:57,824 అవకాశాన్ని తెరిచింది. 125 00:10:59,993 --> 00:11:01,995 సౌత్ ఈస్ట్ అలాస్కా యు.ఎస్.ఎ 126 00:11:02,079 --> 00:11:03,580 వార్షిక సందర్శకులు 13 లక్షలు 127 00:11:03,664 --> 00:11:07,334 ఆహారం కోసం ప్రతి ఏడాదీ, 10,000లకు పైగా 128 00:11:07,417 --> 00:11:08,710 హంప్ బ్యాక్ తిమింగలాలు హవాయి నుండి 129 00:11:10,796 --> 00:11:14,633 ఈ అలాస్కా తీరాలకు వలస వస్తాయి. 130 00:11:23,183 --> 00:11:25,769 సాధారణంగా, ఈ జలాల్ని ఇవి ఏడాదికి పది లక్షలమంది 131 00:11:25,853 --> 00:11:29,690 సందర్శకుల్ని మోసుకెళ్ళే ఓడలతో పంచుకోవాల్సి ఉంటుంది. 132 00:11:36,280 --> 00:11:39,366 కానీ ఇప్పుడు ప్రతి ఓడ రద్దు కావడంతో... 133 00:11:40,284 --> 00:11:45,163 నీటి అడుగున 25 రెట్లు ప్రశాంతంగా మారింది. 134 00:11:46,832 --> 00:11:51,837 ఈ ప్రశాంతతలో, నీటి అడుగున మైక్రోఫోన్లు వాడే శాస్త్రజ్ఞులు 135 00:11:51,920 --> 00:11:54,381 గొప్ప మార్పును రికార్డు చేశారు. 136 00:11:55,132 --> 00:11:58,427 హంప్ బ్యాక్ తిమింగలాలు ఒకదానితో ఒకటి మరింత తరచుగా... 137 00:12:00,637 --> 00:12:02,806 కొత్త పద్ధతుల్లో మాట్లాడుకుంటున్నాయి. 138 00:12:04,725 --> 00:12:07,144 అదీ, ఈ తిమింగలాలు ఇంతసేపు ఒకదానితో ఒకటి సంభాషించుకోవడం... 139 00:12:07,227 --> 00:12:08,812 క్రిస్టీన్ గాబ్రియేల్ తిమింగలాల పరిశోధకురాలు 140 00:12:08,896 --> 00:12:11,315 ...నిజానికి చాలా ఉత్సాహభరితంగా, చెప్పాలంటే కదిలించేలా ఉంది. 141 00:12:11,982 --> 00:12:14,651 ఒకటి అరవగానే, ఆ తర్వాత ఒక తల్లి, పిల్ల. 142 00:12:14,735 --> 00:12:16,570 నా ఉద్దేశం, నేను ఇంతవరకూ అలాంటిది వినలేదు. 143 00:12:18,113 --> 00:12:21,074 ఒక రద్దీగా ఉన్న బార్లో మీ స్నేహితులతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే 144 00:12:21,158 --> 00:12:22,492 ఎలా ఉంటుందో ఊహించుకోండి. 145 00:12:22,576 --> 00:12:25,162 కష్టంగా ఉంటుంది, ఎక్కువగా మాట్లాడరు, మాట్లాడాలని అనుకున్నా, అరవాల్సి వస్తుంది. 146 00:12:25,245 --> 00:12:26,246 డాక్టర్ సుజీ టీర్లింక్ తిమింగలాల పరిశోధకురాలు 147 00:12:26,330 --> 00:12:28,999 కానీ ఒకవేళ మీరు నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్న 148 00:12:29,082 --> 00:12:30,751 కాఫీ షాపులో కూర్చుని ఉంటే, 149 00:12:30,834 --> 00:12:34,880 మీరు మరింత విస్తృతమైన, మంచి సంభాషణ చేయగలుగుతారు. 150 00:12:38,842 --> 00:12:41,720 కానీ మరింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఒకటి ఉంది. 151 00:12:45,182 --> 00:12:50,270 ఇప్పుడు తిమింగలాలు, మరింత దూరప్రాంతాలకు ఎలాంటి అంతరాయాలు లేకుండా సంభాషించగలవు. 152 00:12:50,854 --> 00:12:55,067 ఇలాంటి కొన్ని తల్లులు, తమ పిల్లలను ఒంటరిగా వదిలివెళతాయి. 153 00:12:55,901 --> 00:12:58,403 ఎంతో అరుదైన దృశ్యం. 154 00:13:01,823 --> 00:13:03,825 తల్లి ఇపుడు ఆహార వేటకోసం వెళ్ళగలదు, 155 00:13:03,909 --> 00:13:09,164 అవసరమైనపుడు తన పిల్ల పిలిచే పిలుపు తనకు వినబడుతుందనే నమ్మకం ఇప్పుడు దానికి ఉంది. 156 00:13:15,546 --> 00:13:18,841 పాలిచ్చే తల్లి వీలైనంత ఎక్కువగా తినాల్సి ఉంటుంది, 157 00:13:20,092 --> 00:13:24,096 అందుకు ఉత్తమ మార్గం మిగిలిన పెద్ద తిమింగలాలతో కలిసి వేటాడటం. 158 00:13:30,143 --> 00:13:32,271 తిమింగలాలు నీటి అడుగుకు డైవ్ చేసి... 159 00:13:34,439 --> 00:13:36,984 వృత్తాకారంలో నీటి బుడగలను ఊదుతాయి... 160 00:13:39,152 --> 00:13:42,030 భారీ మొత్తంలో చేపలు ఒకచోట పోగయ్యేలా చేసి... 161 00:13:44,825 --> 00:13:47,786 వేలాదిగా నోట్లో కుక్కేసుకుంటాయి. 162 00:13:53,333 --> 00:13:56,545 ప్రకృతిలోని రమణీయ దృశ్యాలలో ఇదీ ఒకటి. 163 00:14:10,017 --> 00:14:12,186 ప్రశాంతత తోడురాగా, 164 00:14:12,269 --> 00:14:17,024 హంప్ బ్యాక్ తల్లులు ఈ విధంగా మరింత తరచుగా జట్టు కట్టి సహకరించుకోగలుగుతున్నాయి. 165 00:14:18,025 --> 00:14:20,402 ఈ ఏడాది, అవి యదేచ్ఛగా తిరగగలుగుతున్నాయి. 166 00:14:20,485 --> 00:14:24,114 కోరుకున్నది, కోరుకున్న చోట, కోరుకున్నప్పుడల్లా చేస్తున్నాయి. 167 00:14:24,781 --> 00:14:26,283 గత సంవత్సరాల్లో, 168 00:14:26,366 --> 00:14:30,370 అతికొద్దిగా ఏడు శాతం పిల్లలు మాత్రమే పెద్దవి కాగలుగుతున్నాయి. 169 00:14:31,538 --> 00:14:35,709 కానీ ఈ సీజన్ లో, మరెన్నో మనగలగడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. 170 00:14:37,836 --> 00:14:40,964 గత కొద్ది ఏళ్ళుగా తిమింగలాల మనుగడ ప్రశ్నార్థకం అవుతున్న... 171 00:14:41,048 --> 00:14:42,299 జానెట్ నీల్సన్ తిమింగలాల పరిశోధకురాలు 172 00:14:42,382 --> 00:14:45,761 ...ఈ అత్యవసర తరుణంలో, ఈ మహమ్మారి వాటికి కొంత సాంత్వన చేకూర్చింది. 173 00:14:49,348 --> 00:14:54,561 నీటి అడుగున శబ్ద స్థాయుల్లో కలిగిన మార్పులు అలాస్కాను దాటిపోయాయి. 174 00:14:57,064 --> 00:15:02,903 లాక్ డౌన్ మొదలైన మూడునెలల్లో ప్రపంచవ్యాప్త షిప్పింగ్ ట్రాఫిక్ 17 శాతం పడిపోయింది, 175 00:15:03,695 --> 00:15:07,115 అన్ని మహా సముద్రాలలో జీవుల జీవితాలు మెరుగుపడ్డాయి. 176 00:15:07,199 --> 00:15:10,160 హర్రాకి గల్ఫ్ న్యూజిలాండ్ 177 00:15:11,453 --> 00:15:13,539 న్యూజిలాండ్ తీరాల్లో ఉన్న డాల్ఫిన్స్ 178 00:15:13,622 --> 00:15:16,250 అవి కమ్యూనికేషన్ చేసే దూరాన్ని మూడురెట్లు పెంచుకున్నాయి. 179 00:15:20,003 --> 00:15:21,338 శాలిష్ సముద్రం కెనడా 180 00:15:21,421 --> 00:15:26,552 వ్యాంకోవర్లో ఓడల రొద నాలుగు రెట్లు తగ్గిందనీ, తద్వారా కిల్లర్ వేల్స్ 181 00:15:27,219 --> 00:15:30,264 సోనార్ సాయంతో మరింత సమర్థవంతంగా 182 00:15:30,347 --> 00:15:33,016 వేటాడగలుగుతున్నాయని పరిశోధకులు రికార్డు చేశారు. 183 00:15:48,407 --> 00:15:51,201 మహమ్మారి బారినపడి మూడు నెలలైంది. 184 00:15:51,285 --> 00:15:52,452 3 నెలలు 185 00:15:52,536 --> 00:15:57,332 యునైటెడ్ స్టేట్స్ లో, దాదాపు సగం మంది ఉద్యోగులు ఇంటి దగ్గరనుండి పనిచేస్తున్నారు. 186 00:15:57,416 --> 00:16:01,044 ప్రపంచవ్యాప్తంగా, పావు భాగం వ్యాపారాలు మూతపడ్డాయి. 187 00:16:03,005 --> 00:16:06,925 బార్లు, రెస్టారెంట్లు, కెఫెలు తాత్కాలికంగా మూతబడ్డాయి. 188 00:16:07,885 --> 00:16:12,514 అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే, రిటైల్ వ్యాపారం మూతపడింది. 189 00:16:13,599 --> 00:16:17,311 అంతా వదిలివేసినట్లుగా, చుట్టూ ఎవ్వరూ లేనట్లుగా అనిపిస్తోంది. 190 00:16:18,395 --> 00:16:20,731 ప్రపంచంలో ప్రముఖ నగరాలన్నింటిలో, 191 00:16:20,814 --> 00:16:24,985 ప్రజలు నడవడం 90 శాతానికి పైగా తగ్గిపోయింది. 192 00:16:27,196 --> 00:16:29,531 పట్టణ కేంద్రాలు ఎడారుల్లా మారిపోగానే... 193 00:16:29,615 --> 00:16:31,450 నగర జీవనాన్ని 194 00:16:31,533 --> 00:16:35,370 తమకు అనుగుణంగా మార్చుకున్న జంతువుల అరుదైన చిత్రాలు బయటపడ్డాయి. 195 00:16:37,039 --> 00:16:39,041 సెయింట్ లూసియా సౌత్ ఆఫ్రికా 196 00:16:39,124 --> 00:16:42,169 గ్యాస్ స్టేషన్ కి విచ్చేసిన ఒక హిప్పో. 197 00:16:46,173 --> 00:16:47,424 టెల్ అవివ్ ఇస్రాయిల్ 198 00:16:47,508 --> 00:16:50,219 స్థానిక పార్కులో ఎంజాయ్ చేస్తున్న నక్కలు. 199 00:16:53,847 --> 00:16:55,057 శాన్ టియాగో చిలీ 200 00:16:55,140 --> 00:16:58,101 పేవ్మెంట్ మీద చక్కర్లు కొడుతున్న చిరుతపులి. 201 00:17:06,068 --> 00:17:10,196 అయితే ఒక జంతువు మాత్రం తనదైన చాతుర్యంతో, ఈ నిర్మానుష్యమైన 202 00:17:10,280 --> 00:17:12,657 నగర ప్రాంతాలకు అనుగుణంగా మారిపోయింది. 203 00:17:16,869 --> 00:17:19,205 నారా జపాన్ 204 00:17:19,289 --> 00:17:22,084 వార్షిక సందర్శకులు కోటీ 30 లక్షలు 205 00:17:25,253 --> 00:17:29,591 సుమారు 1300 సంవత్సరాలుగా, 206 00:17:29,675 --> 00:17:32,845 నారా నగరం సికా జింకలకు నిలయం. 207 00:17:36,223 --> 00:17:39,059 ఆహారం కోసం అవి ఆధారపడిన పచ్చిక బయళ్ళలో అధికభాగాన్ని 208 00:17:39,142 --> 00:17:41,812 బిల్డింగులు ఆక్రమించాయి. 209 00:17:41,895 --> 00:17:45,440 సాధారణంగా సిగ్గరులైన ఈ జంతువులు ఒక పరిష్కారాన్ని కనిపెట్టాయి. 210 00:17:48,735 --> 00:17:55,367 నారా దేవాలయాల్ని సందర్శించే కోటీ 30 లక్షల మందిని ఈ జింకలు లక్ష్యంగా చేసుకున్నాయి... 211 00:17:56,952 --> 00:17:59,955 కాస్తంత గౌరవాన్ని ప్రదర్శిస్తే చాలు, బోలెడు రుచికరమైన... 212 00:18:02,082 --> 00:18:03,917 తినుబండారాలు దొరుకుతాయని గ్రహించాయి. 213 00:18:08,463 --> 00:18:13,010 బియ్యపు పొట్టుతో చేసే బిస్కెట్లు వాటి ఆహారంలో కీలక భాగం అయ్యాయి. 214 00:18:22,978 --> 00:18:25,522 కానీ ఈ పరిస్థితిని మహమ్మారి మార్చివేసింది. 215 00:18:32,154 --> 00:18:35,699 రాత్రికి రాత్రే వాటికిష్టమైన తినుబండారాలు అదృశ్యం అయ్యాయి. 216 00:18:40,996 --> 00:18:44,208 జనం లేకపోతే బిస్కెట్లు ఎక్కడినుండి వస్తాయి. 217 00:18:53,133 --> 00:18:56,678 జింకలు తిండిలేక అల్లాడే పరిస్థితి రావొచ్చు. 218 00:18:56,762 --> 00:19:00,974 కానీ పాతతరంలో ఉన్న కొన్నిటికి ఒక ప్లాన్ సిద్ధంగా ఉంది. 219 00:19:06,104 --> 00:19:10,025 దేవాలయం ప్రాంగణం నుండి ఒక గుంపుకి బయటికి దారి చూపించాయి. 220 00:19:10,526 --> 00:19:12,945 కానీ ఎక్కడికి వెళుతున్నాయో వాటికి తెలిసినట్లే కనబడుతోంది. 221 00:19:21,161 --> 00:19:23,789 అవి ఒక పెద్ద రోడ్డు దిగువకు... 222 00:19:26,124 --> 00:19:29,336 నగరంలోని నిర్మాణాల లోతుల్లోకి చొచ్చుకుపోయాయి. 223 00:19:40,889 --> 00:19:44,643 కానీ విస్తరించిన ఈ పట్టణంలో వాటికి ఆహారం ఎక్కడ దొరుకుతుంది? 224 00:19:52,734 --> 00:19:55,153 రెండున్నర కిలోమీటర్లు నడిచిన తర్వాత... 225 00:19:56,989 --> 00:19:58,991 ఆ గుంపు ఒక చోట ఆగింది. 226 00:20:04,454 --> 00:20:09,459 ప్రశాంతమైన ఈ ప్రాంతం ఒకప్పుడు అవి పచ్చిక మేసిన మైదానాల్లో ఒక భాగం. 227 00:20:10,586 --> 00:20:12,713 ఆశ్చర్యకరంగా, ఒకప్పుడు అది తాము గడ్డిమేసిన 228 00:20:12,796 --> 00:20:16,592 ప్రాంతమని ఈ ముసలి జింకకి గుర్తుంది. 229 00:20:23,807 --> 00:20:26,268 వాటికి కావలసినవన్నీ అది అందించింది: 230 00:20:26,852 --> 00:20:30,439 స్వచ్ఛమైన గడ్డి, ఆకులు, మూలికలు. 231 00:20:35,152 --> 00:20:36,570 తరువాతి వారాలలో, 232 00:20:36,653 --> 00:20:41,992 అవి ఇప్పటికీ మిగిలిఉన్న ఈ భూభాగంపై ఆధారపడతాయి. 233 00:20:44,286 --> 00:20:48,207 జనం లేకపోవడం వల్ల మరో ఉపయోగం జరిగింది. 234 00:20:50,250 --> 00:20:55,589 ఈ కొత్త డైట్ వాటిని ఆరోగ్యకరంగా మార్చిందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు... 235 00:20:57,674 --> 00:21:01,678 తక్కువ సందర్శకులుంటే తక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలుంటాయి, 236 00:21:02,346 --> 00:21:04,056 అవి జింకల్ని చంపగలవు. 237 00:21:09,728 --> 00:21:13,273 మన ఉనికి కారణంగా జంతువులు ప్రయోజనం పొందుతున్నట్లు కనిపించినప్పటికీ... 238 00:21:16,109 --> 00:21:19,738 ఎక్కువ సందర్భాల్లో, మనం లేకుంటేనే అవి సంతోషంగా జీవిస్తాయి. 239 00:21:30,958 --> 00:21:33,085 లాక్ డౌన్ మొదలై నాలుగు నెలలు పూర్తయ్యాయి, మనం లేని ప్రతిచోటా... 240 00:21:33,168 --> 00:21:35,128 బోనోస్ ఐరిస్ - అర్జెంటినా జనాభా కోటీ 52 లక్షలు 241 00:21:35,212 --> 00:21:39,633 ...మనం వదిలివేసిన చోటు జంతుజాలానికి సరికొత్త అవకాశాలను తెరుస్తోంది. 242 00:21:46,765 --> 00:21:48,225 అర్జెంటినాలో... 243 00:21:49,268 --> 00:21:51,562 సాధారణంగా సిగ్గరులైన కేపిబారా 244 00:21:51,645 --> 00:21:55,524 ధనికుల అందమైన తోటల మీద దాడి చేశాయి... 245 00:21:57,317 --> 00:22:00,821 ఒకప్పుడు తమ ఇల్లైన చిత్తడి నేలపై దాన్ని నిర్మించారు. 246 00:22:04,032 --> 00:22:08,829 వాస్తవానికి తమ సొంతమైన దాన్ని ఎంజాయ్ చేయనివ్వకుండా ఏదీ ఆపగలదని అనిపించడం లేదు. 247 00:22:27,472 --> 00:22:28,682 అదీ... 248 00:22:30,392 --> 00:22:31,727 దాదాపు ఏదీ ఆపలేదు. 249 00:22:39,234 --> 00:22:44,781 మన ఉనికి లేకుండా ఎంతకాలం ఉంటే, అంత సాహసోపేతంగా జంతువులు తయారవుతాయి. 250 00:22:46,366 --> 00:22:49,995 ఆఫ్రికాలో సఫారీ సీజన్ రద్దయినప్పుడు... 251 00:22:50,954 --> 00:22:52,497 ఉమ్పుమలాంగా - సౌత్ ఆఫ్రికా వార్షిక సందర్శకులు 42 లక్షలు 252 00:22:52,581 --> 00:22:55,417 …ఒక ప్రాణాంతక వేటగాడు నియమాలను తిరగరాస్తుంది. 253 00:22:58,086 --> 00:23:01,006 ఈ లగ్జరీ లాడ్జి ఖాళీగా ఉంది. 254 00:23:02,841 --> 00:23:07,554 అయితే కొత్త అతిధులు రావడానికి ఎంతో కాలం పట్టదు. 255 00:23:14,811 --> 00:23:18,065 వెర్వెట్ కోతులు స్విమ్మింగ్ పూల్ పక్కన తిష్ట వేశాయి. 256 00:23:24,112 --> 00:23:26,615 మరోవైపు ఇంపాలా, ఇంకా న్యాలా యాంటలోప్ 257 00:23:27,407 --> 00:23:29,993 సలాడ్ బార్ ని ఆక్రమించాయి. 258 00:23:34,039 --> 00:23:36,124 అయితే పూర్తిగా ఎదిగిన... 259 00:23:38,168 --> 00:23:42,589 ఒక మగ చిరుతపులి ఎంతోదూరంలో లేదు. 260 00:23:49,763 --> 00:23:54,685 సాధారణంగా ఈ నిశాచర వేటగాడు పగలు కనిపించడం 261 00:23:54,768 --> 00:23:57,062 చాలా ఆశ్చర్యకరమైన విషయం. 262 00:23:57,145 --> 00:23:59,898 మా చిత్ర బృందానికి మాత్రం కాదు. 263 00:24:00,524 --> 00:24:02,192 కదలకుండా నిలబడండి, గైస్. 264 00:24:41,356 --> 00:24:42,941 రస్సెల్ మెక్లాగ్లిన్ వైల్డ్ లైఫ్ కెమెరామెన్ 265 00:24:43,025 --> 00:24:46,195 నా జీవితంలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి, కానీ ఇది అన్నిటినీ మించిపోయింది. 266 00:24:50,699 --> 00:24:52,117 ఆఫ్రికా అంతటా, 267 00:24:52,201 --> 00:24:56,538 60% పైగా భూభాగాన్ని చిరుతపులులు మనుషులవల్ల కోల్పోయాయి, 268 00:24:57,122 --> 00:24:59,875 వేటాడడం మరింత సవాలుగా మారిపోయింది. 269 00:25:02,503 --> 00:25:05,088 కానీ ఇక్కడ అతిధులు ఎవరూ లేకపోవడంతో, 270 00:25:05,672 --> 00:25:08,425 ఈ చిరుతపులికి అవకాశం కనిపించింది, 271 00:25:09,134 --> 00:25:13,180 దాని ప్రవర్తనలో అసాధారణమైన మార్పు కనిపించింది. 272 00:25:17,059 --> 00:25:19,895 అది పగటిపూట వేటాడడం మొదలుపెట్టింది. 273 00:25:29,821 --> 00:25:32,157 కొన్నిసార్లు ప్రయత్నించాల్సి వచ్చినప్పటికీ... 274 00:25:35,244 --> 00:25:36,912 ఎంతోసేపు కష్టపడాల్సిన అవసరం లేకుండానే... 275 00:25:38,455 --> 00:25:40,457 దాని కొత్త పథకం... 276 00:25:41,041 --> 00:25:42,251 ఫలించింది. 277 00:25:49,800 --> 00:25:51,593 గత 25 ఏళ్ళలో 278 00:25:51,677 --> 00:25:55,597 చిరుతపులుల సంఖ్య 30 శాతానికి పైగా పడిపోయింది. 279 00:25:56,557 --> 00:26:02,271 కానీ దేన్నైనా తినగల ఈ సరికొత్త లాక్ డౌన్ బఫేని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటూ, 280 00:26:02,354 --> 00:26:04,356 ఈ చిరుతపులి అభివృద్ధి చెందుతోంది. 281 00:26:05,023 --> 00:26:08,694 ఈ చోటు దాదాపు పూర్తిగా దాని ఇల్లులా మారిపోయింది. దాని ప్రైవేటు రాజ్యం. 282 00:26:24,835 --> 00:26:27,921 మహమ్మారి మొదలై ఆరు నెలలు అయింది. 283 00:26:28,005 --> 00:26:29,965 6 నెలలు 284 00:26:30,048 --> 00:26:35,262 సెప్టెంబర్ నాటికి, 40 దేశాలకు పైగా ఆంక్షలు కొనసాగిస్తూనే ఉన్నాయి. 285 00:26:37,222 --> 00:26:41,393 దాదాపు 300ల కోట్లకు పైగా ప్రజల దైనందిన కార్యకలాపాలు ఆగిపోయాయి. 286 00:26:42,311 --> 00:26:43,645 లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్స్, 287 00:26:43,729 --> 00:26:49,484 కాన్సర్ట్స్, పండుగలు వంటి భారీగా జనం గుమిగూడే ప్రదేశాలు, 288 00:26:49,568 --> 00:26:54,573 వాక్సిన్ వంటి నమ్మదగ్గ చికిత్స దొరికేవరకూ తిరిగి తెరుచుకోవు. 289 00:26:56,408 --> 00:26:59,161 మనం మన కొత్త జీవితానికి అలవాటు పడే సమయంలో, 290 00:26:59,995 --> 00:27:03,207 ప్రకృతి పునరుద్ధరణ కొనసాగుతుంది. 291 00:27:04,917 --> 00:27:06,168 గంగ ఇండియా 292 00:27:06,251 --> 00:27:08,462 ఇండియాలో, గంగానదిలో 293 00:27:08,545 --> 00:27:12,674 80 శాతానికి పైగా ఆక్సిజన్ స్థాయులు పెరిగాయి. 294 00:27:15,177 --> 00:27:16,386 అట్లాంటిక్ తీరం మొరాకో 295 00:27:16,470 --> 00:27:18,847 ఆఫ్రికా అట్లాంటిక్ తీరంలో, 296 00:27:19,348 --> 00:27:25,270 నీటి స్వచ్ఛత దారుణమైన స్థితి నుండి అద్భుతమైన స్థితికి శరవేగంగా మారింది. 297 00:27:29,900 --> 00:27:34,363 మనం ఇళ్ళలోంచి బయటికి రావడానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి, 298 00:27:34,446 --> 00:27:37,366 ఈలోగా జీవజాతుల కొత్త తరం ప్రయోజనం పొందబోతోంది. 299 00:27:37,449 --> 00:27:38,992 కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికా 300 00:27:39,076 --> 00:27:40,077 జనాభా 47 లక్షలు 301 00:27:40,160 --> 00:27:42,579 ఇక్కడి సౌత్ ఆఫ్రికన్ తీరంలో, 302 00:27:42,663 --> 00:27:47,000 కొందరు కొత్త తల్లిదండ్రులు ఉదయం ప్రయాణానికి సిద్ధమయ్యారు. 303 00:27:53,549 --> 00:27:56,385 ఆఫ్రికన్ జాకాస్ పెంగ్విన్స్. 304 00:28:05,561 --> 00:28:09,022 అవి మనుషుల పక్కనే తమ ఇంటిని ఏర్పాటు చేసుకున్నాయి. 305 00:28:26,540 --> 00:28:28,500 బ్రీడింగ్ సీజన్లో, 306 00:28:28,584 --> 00:28:32,421 ప్రతి ఉదయం అవి సముద్రంలో చేపలు పట్టడానికి బయలుదేరతాయి. 307 00:28:39,970 --> 00:28:42,389 వాటి కూనలకు ఆకలి మహా ఎక్కువ. 308 00:28:43,765 --> 00:28:48,687 ప్రతిరోజూ అవి తమ శరీర బరువులో 15 శాతం బరువున్న ఆహారం తినాలి. 309 00:28:51,523 --> 00:28:55,319 అదృష్టవశాత్తూ, జాకాస్ పెంగ్విన్స్ సమర్థవంతమైన వేటగాళ్ళు... 310 00:28:56,153 --> 00:28:58,572 80 మీటర్ల లోతుకు డైవ్ చేయగలవు 311 00:28:59,406 --> 00:29:03,076 బోలెడన్ని చేపలు, ఎండ్రకాయలతో విందు చేసుకోవచ్చు. 312 00:29:09,333 --> 00:29:13,378 అయితే ఆహారాన్ని తమ కూనల వరకూ చేర్చడం ఒక సమస్య. 313 00:29:18,675 --> 00:29:22,513 గత సంవత్సరాల్లో, ఈ బీచులు జనంతో నిండిపోయి ఉండేవి. 314 00:29:23,639 --> 00:29:26,517 చేపలు పట్టి పెంగ్విన్లు తిరిగి వచ్చేసరికి... 315 00:29:27,226 --> 00:29:29,478 అవి ఇంటికి వెళ్ళాల్సిన దారి మూసుకుపోయి ఉండేది. 316 00:29:30,812 --> 00:29:34,399 సూర్యాస్తమయం అయ్యి, జనం ఇళ్ళకు చేరే వరకూ అవి తీరంలోనే 317 00:29:36,527 --> 00:29:38,487 వేచి ఉండాల్సి వచ్చేది. 318 00:29:47,788 --> 00:29:51,834 కానీ ఈ ఏడాది, బీచి ఎడారిలా మారింది. 319 00:29:59,758 --> 00:30:02,427 పెంగ్విన్లు పాత రొటీన్ ని వదిలేసి, 320 00:30:02,511 --> 00:30:06,390 తమ కూనల కోసం కడుపునిండా చేపలతో, సముద్రంలో కొద్ది గంటలు 321 00:30:07,349 --> 00:30:10,143 గడిపిన వెంటనే ఇంటికి తిరిగి రావడం మొదలుపెట్టాయి. 322 00:30:16,900 --> 00:30:22,531 చీకటి పడేందుకు ఎంతో సమయం ఉండడంతో, అవి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళగలవు. 323 00:30:28,453 --> 00:30:33,584 కూనలు ఇప్పుడు రోజుకు రెండు మూడుసార్లు తినగలుగుతున్నాయి. 324 00:30:36,420 --> 00:30:39,339 అవి ఆరోగ్యంగా, చాలా వేగంగా పెరగడం మాత్రమే కాదు, 325 00:30:39,423 --> 00:30:44,970 ఇలాంటి ఎన్నో కుటుంబాలు విజయవంతంగా కవలలను పెంచుతున్నాయి. 326 00:30:46,930 --> 00:30:49,099 మరో శుభవార్త కూడా ఉంది. 327 00:30:49,183 --> 00:30:50,684 రాబోయే కొద్ది వారాల్లో, 328 00:30:50,767 --> 00:30:56,148 కొన్ని తల్లిదండ్రులు విజయవంతంగా మరో రౌండ్ పిల్లల్ని కంటాయి, 329 00:30:56,690 --> 00:31:00,194 దశాబ్దకాలంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. 330 00:31:03,572 --> 00:31:06,909 ఎన్నో ఏళ్ళుగా పెంగ్విన్లు, ఇక్కడి ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నట్లు 331 00:31:06,992 --> 00:31:08,911 భావించడం జరిగింది. 332 00:31:12,706 --> 00:31:17,169 కానీ వాస్తవానికి, మనం వారి జీవితాల్ని కష్టతరం చేస్తున్నాం. 333 00:31:21,548 --> 00:31:24,426 గత 30 ఏళ్ళలో, సౌత్ ఆఫ్రికాలో 334 00:31:24,510 --> 00:31:28,597 పెంగ్విన్ల సంఖ్య దాదాపు 70 శాతానికి పైగా పడిపోవడంతో... 335 00:31:30,599 --> 00:31:33,018 మనం వాటికి ఎంత సాయం చేయగలిగితే అంత అవసరం. 336 00:31:42,069 --> 00:31:46,406 నగరాల్లో నివసిస్తున్న జంతువుల పిల్లలు మాత్రమే అభివృద్ధి చెందడం లేదు. 337 00:31:48,075 --> 00:31:51,495 ఇప్పటికే, ఈ ఏడాది విధించిన ఆంక్షల ప్రభావం 338 00:31:51,578 --> 00:31:55,123 ప్రపంచంలోని క్రూరమైన ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. 339 00:31:55,207 --> 00:31:57,417 మాసాయి మారా - కెన్యా వార్షిక సందర్శకులు 3,00,000లకు పైగా 340 00:31:57,501 --> 00:32:01,296 తన కూనల్ని కాపాడుకోవడం కోసం ఒక పులి తన సామర్థ్యాన్ని రూపాంతరం చెందించుకుంది. 341 00:32:04,508 --> 00:32:05,759 చిరుత. 342 00:32:11,014 --> 00:32:13,851 భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తగల ప్రాణి. 343 00:32:30,200 --> 00:32:31,660 కానీ వాటికి ఒక బలహీనత ఉంది. 344 00:32:31,743 --> 00:32:36,999 సన్నని శరీరం కారణంగా శత్రువులకు ఉండేంత బలం వాటికి ఉండదు, 345 00:32:38,959 --> 00:32:41,420 సింహాలు, హైనాల లాగా. 346 00:32:46,133 --> 00:32:48,635 అవి చిరుత సంపాదించిన ఆహారాన్ని దొంగిలించి, 347 00:32:49,386 --> 00:32:51,722 ఏ మాత్రం సంకోచించకుండా దాని కూనను చంపేస్తాయి. 348 00:33:02,733 --> 00:33:05,444 చిరుతలు వాటి కంట్లో పడకుండా కొంచెం తగ్గి ఉంటాయి. 349 00:33:08,155 --> 00:33:10,157 అయితే తిండి పెట్టాల్సిన రెండు కూనలు ఉండడంతో, 350 00:33:10,949 --> 00:33:14,995 వీటి తల్లి ప్రతి రెండు లేదా మూడు రోజులకొకసారి వేటాడాల్సి ఉంటుంది. 351 00:33:31,720 --> 00:33:33,013 అది వేటకు వెళ్ళినపుడు, 352 00:33:33,096 --> 00:33:37,059 దాని ఆరు నెలల వయసున్న కూనలు పొడవాటి గడ్డిలో దాక్కుని ఉంటాయి. 353 00:33:40,145 --> 00:33:45,859 కానీ వేట పూర్తయిన వెంటనే, అది సందిగ్ధంలో పడుతుంది. 354 00:33:50,781 --> 00:33:53,158 అది వాటికి కొన్ని వందల మీటర్ల దూరంలో ఉంది, 355 00:33:53,617 --> 00:33:56,328 చంపిన ప్రాణి శరీరం లాక్కెళ్ళలేనంత పెద్దదిగా ఉంది. 356 00:33:58,247 --> 00:34:02,459 దాన్ని వదిలేసి వెళితే, దొంగతనానికి గురయ్యే ప్రమాదం ఉంది. 357 00:34:05,963 --> 00:34:09,466 అందుకు పరిష్కారంగా అది మృదువుగా కీచుగొంతుతో ఒక శబ్దం చేస్తుంది... 358 00:34:10,634 --> 00:34:12,386 ...తన కూనల్ని అక్కడికి రమ్మనే పిలుపు అది. 359 00:34:15,179 --> 00:34:16,389 అది జాగ్రత్తగా ఉండాలి. 360 00:34:17,099 --> 00:34:19,476 పెద్ద గొంతుతో పిలిచినా, ఎక్కువసార్లు పిలిచినా, 361 00:34:19,560 --> 00:34:23,146 రక్షణలేని తన కూనలు శత్రువుల కంట్లో పడే ప్రమాదం ఉంది. 362 00:34:26,483 --> 00:34:28,569 ఇలాంటి సందర్భంలోనే 363 00:34:28,652 --> 00:34:32,114 కూనలు చిరుత అరుపును వినడం కష్టమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. 364 00:34:36,284 --> 00:34:38,704 లాక్ డౌన్ ముందు సంవత్సరాల్లో, 365 00:34:38,786 --> 00:34:42,666 మాసాయి మారాకు వచ్చే పర్యాటకులు ఖచ్చితంగా చూడాలని కోరుకునే 366 00:34:42,748 --> 00:34:44,751 విషయాల్లో ఒకటి చిరుత వేట. 367 00:34:45,585 --> 00:34:49,965 కానీ వేటాడడం పూర్తి చేసిన తల్లి చిరుత చుట్టూ ఉన్న జనం ఒక సమస్యగా మారారు. 368 00:34:51,842 --> 00:34:54,094 ఎంతో గందరగోళంగా ఉండేది. వాహనాలు వెళ్ళడం, రావడం. 369 00:34:54,178 --> 00:34:55,387 సాలిమ్ మండేలా చిరుత పరిశోధకుడు 370 00:34:55,971 --> 00:34:59,349 రేడియోలో గైడ్లు మాట్లాడుతూ ఉంటారు, జనం ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటారు. 371 00:35:00,893 --> 00:35:02,936 ఆ గొడవలో తల్లి చిరుత కూనల కోసం 372 00:35:03,020 --> 00:35:05,397 పిలిచే అరుపులు వాటికి వినిపించకుండా పోతాయి. 373 00:35:06,064 --> 00:35:07,816 మనుగడ కోసం చిరుత ఆధారపడే 374 00:35:07,900 --> 00:35:12,321 ప్రాకృతిక సంకేతాల్ని ఆ గందరగోళం వినబడకుండా చేస్తుంది. 375 00:35:15,699 --> 00:35:20,662 పదేపదే పిలవాల్సి రావడం అంటే శత్రువుల్ని ఆకర్షించడమే. 376 00:35:30,589 --> 00:35:32,174 కానీ ఈ ఏడాది... 377 00:35:32,257 --> 00:35:36,220 ఈ చిరుత తల్లికి మనుషుల వల్ల ఎలాంటి అంతరాయం కలగడం లేదు. 378 00:35:41,517 --> 00:35:45,020 ఖాళీ సవానాలో కొన్నిసార్లు పిలవగానే... 379 00:35:49,066 --> 00:35:50,943 ...దాని కూనలు తల్లి పిలుపును విన్నాయి... 380 00:35:57,282 --> 00:35:59,201 తల్లి దగ్గరికి చేరుకున్నాయి. 381 00:36:03,664 --> 00:36:06,333 తల్లులు కొద్దిసార్లు మాత్రమే పిలవడాన్ని మేము గుర్తించాం. 382 00:36:06,416 --> 00:36:09,753 ఒకటి రెండు సార్లు పిలవగానే, కూనలు వెంటనే స్పందించాయి. 383 00:36:12,214 --> 00:36:13,924 చుట్టూ జనం లేకపోవడంతో, 384 00:36:14,007 --> 00:36:17,386 చిరుత పిల్లలు ఆరోగ్యంగా పెరగడాన్ని ఇప్పటికే పరిశోధకులు కనిపెట్టారు. 385 00:36:19,847 --> 00:36:23,725 కోవిడ్ ముందు, మూడింటిలో ఒక కూన మాత్రమే బతికేది. 386 00:36:23,809 --> 00:36:25,811 కానీ ప్రస్తుతం మూడు నెలలు పైబడిన 387 00:36:25,894 --> 00:36:28,021 కూనలు ఎన్నో కనిపిస్తున్నాయి, 388 00:36:28,105 --> 00:36:29,815 అది ఏ విషయాన్ని స్పష్టం చేస్తోందంటే 389 00:36:29,898 --> 00:36:33,026 ఈసారి ఎక్కువ కూనలు బతికి బట్టకడతాయి, 390 00:36:33,110 --> 00:36:34,778 అంటే ఎక్కువ చిరుతలు. 391 00:36:37,739 --> 00:36:41,952 ఆఫ్రికాలో కేవలం సుమారు 7,000ల చిరుతలు మాత్రమే మిగిలి ఉండడంతో... 392 00:36:43,954 --> 00:36:45,831 ప్రతి కూన విలువైనదే. 393 00:37:05,309 --> 00:37:08,395 మనుషులకు ఈ ఏడాది ఎన్నో సవాళ్ళు విసురుతూనే ఉంది... 394 00:37:08,478 --> 00:37:09,813 బ్విండి నేషనల్ పార్క్ ఉగాండా 395 00:37:09,897 --> 00:37:11,565 …అంతరించే దశలో ఉన్న ఎన్నో, ఎన్నెన్నో జంతువులు 396 00:37:11,648 --> 00:37:15,485 మనగలగడానికి గల అవకాశాలు పెరిగాయి. 397 00:37:20,532 --> 00:37:23,535 2020 సంవత్సరంలో తక్కువ అంతరాయం ఉండడంతో, 398 00:37:23,619 --> 00:37:24,912 ఇక్కడి మౌంటైన్ గొరిల్లాలు 399 00:37:24,995 --> 00:37:28,665 పిల్లలకంటే రెట్టింపు పిల్లలకు జన్మనిచ్చాయి. 400 00:37:34,588 --> 00:37:36,089 ఇంగ్లాండ్ దక్షిణ తీరంలో... 401 00:37:36,173 --> 00:37:37,174 డోర్సెట్ ఇంగ్లాండ్ 402 00:37:37,257 --> 00:37:42,679 ...గత పదేళ్ళలో చూడని విధంగా అరుదైన స్పైనీ సీ హార్సెస్ సంఖ్య బాగా పెరిగింది 403 00:37:43,180 --> 00:37:48,602 పడవల వల్ల వాటి సీ గ్రాస్ ఇంటికి కలిగిన నష్టం నుండి కోలుకుంది. 404 00:37:54,024 --> 00:37:55,359 లైకిపియా కెన్యా 405 00:37:55,442 --> 00:37:58,695 కెన్యాలో, కొమ్ముల కోసం ఈ ఏడాది ఒక్క రైనో కూడా చంపబడలేదు. 406 00:37:59,363 --> 00:38:02,699 1999 తర్వాత ఇదే మొదటిసారి. 407 00:38:11,416 --> 00:38:14,086 లాక్ డౌన్ మొదలయ్యి పూర్తిగా ఒక ఏడాది పూర్తయింది. 408 00:38:14,169 --> 00:38:15,337 12 నెలలు 409 00:38:15,420 --> 00:38:20,217 మనలో ఎక్కువమంది సహజ ప్రపంచంలో సౌకర్యాన్ని పొందిన సంవత్సరం. 410 00:38:20,926 --> 00:38:25,848 ప్రపంచం ఎన్నో అసాధారణ మార్పులకు గురైన సంవత్సరం. 411 00:38:29,059 --> 00:38:32,187 ప్రపంచవ్యాప్తంగా కార్బన్ డయాక్సైడ్ వార్షిక ఉద్గారాలు 412 00:38:32,271 --> 00:38:35,023 ఆరు శాతానికి పైగా పడిపోయాయి, 413 00:38:35,107 --> 00:38:37,568 ఆ స్థాయిలో తగ్గుదల ఇంతవరకూ జరగలేదు. 414 00:38:39,486 --> 00:38:43,824 అలాగే భూమి ఉపరితలం అడుగున కూడా ఎన్నో గుర్తించదగ్గ మార్పులు చోటుచేసుకున్నాయి. 415 00:38:44,825 --> 00:38:48,620 ప్రయాణాల వల్ల, పరిశ్రమల వల్ల కలిగే ప్రకంపనలు సగానికి తగ్గడంతో, 416 00:38:48,704 --> 00:38:53,458 నమోదైన చరిత్రలో ఈ కాలం భూగర్భం అత్యంత ప్రశాంతంగా ఉన్నకాలం. 417 00:38:57,796 --> 00:39:00,716 అయితే ఈ లాక్ డౌన్ ప్రభావం ఎంతోకాలం నిలవదు. 418 00:39:02,217 --> 00:39:05,637 ప్రకృతితో మెరుగైన సహజీవనం చేసే మార్గాలు కనిపెట్టేందుకు 419 00:39:05,721 --> 00:39:09,474 ఈ మార్పుల నుండి ఎలాంటి ప్రేరణ తీసుకోవచ్చు? 420 00:39:14,396 --> 00:39:17,900 ఇండియాలో, ఇప్పటికే కొందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, 421 00:39:17,983 --> 00:39:19,693 కొన్ని శక్తివంతమైన, 422 00:39:19,776 --> 00:39:24,156 అంతరించే దశలో ఉన్న జంతువులతో మరింత సామరస్యంతో జీవించే ప్రయత్నం చేస్తున్నారు. 423 00:39:27,659 --> 00:39:32,164 అస్సాం - ఇండియా జనాభా మూడుకోట్ల 60 లక్షలు 424 00:39:33,582 --> 00:39:35,626 పూర్తిగా ఎదిగిన ఆసియా ఏనుగు 425 00:39:35,709 --> 00:39:40,380 ప్రతిరోజూ 150 కిలోల ఆహారం తినాల్సి ఉంటుంది. 426 00:39:41,590 --> 00:39:45,010 కానీ వాటి సహజ ఆవాసాల్లో కేవలం ఐదు శాతం మాత్రమే మిగిలి ఉండడంతో, 427 00:39:45,594 --> 00:39:48,972 వాటి అరణ్య భూమి వ్యవసాయ భూములుగా మార్చబడడంతో... 428 00:39:49,056 --> 00:39:53,685 మనుగడ కోసం ఏనుగులు ఇక్కడి పంటలపై దాడి చేస్తాయి. 429 00:40:05,989 --> 00:40:10,035 బదులుగా, రైతులు వాటిని పొలాల నుండి తరిమేస్తారు. 430 00:40:11,453 --> 00:40:17,376 కానీ ఇప్పటికీ వారు తమ వరి పంటలలో సగభాగాన్ని కోల్పోవాల్సి వస్తోంది. 431 00:40:30,138 --> 00:40:32,057 మేము రాత్రి మొత్తం వాటిని 432 00:40:32,140 --> 00:40:33,892 అడవిలోకి తరిమేస్తూ గడుపుతూ ఉంటాం. 433 00:40:33,976 --> 00:40:35,394 కానీ అవి తిరిగి వస్తాయి... 434 00:40:35,477 --> 00:40:36,478 భాష్కర్ బారా 435 00:40:36,562 --> 00:40:39,606 ...మేము మళ్ళీ అదే పని చేయాల్సి ఉంటుంది. 436 00:40:53,745 --> 00:40:57,040 ప్రమాదంలో ఉన్నది కేవలం పొలాలు మాత్రమే కాదు. 437 00:41:00,043 --> 00:41:03,630 ఏనుగులు ఆహారం కోసం వెతుకుతూ గ్రామాల్లోకి కూడా వచ్చేస్తాయి 438 00:41:03,714 --> 00:41:06,341 ఆ క్రమంలో జనాన్ని తొక్కేస్తాయి. 439 00:41:11,054 --> 00:41:12,055 దేశవ్యాప్తంగా, 440 00:41:12,139 --> 00:41:15,809 సుమారు 400 మంది మనుషులు, వంద వరకూ ఏనుగులు 441 00:41:15,893 --> 00:41:18,896 ప్రతి ఏడాది, ఈ గొడవల్లో చనిపోతూ ఉంటాయి. 442 00:41:25,819 --> 00:41:28,864 కానీ ఒక కమ్యూనిటీ కొత్త పద్దతిని అమలుచేయడం ద్వారా 443 00:41:28,947 --> 00:41:30,657 సమస్యను పరిష్కరించాలని అనుకుంటోంది. 444 00:41:31,241 --> 00:41:34,411 లాక్ డౌన్ వల్ల సిటీల నుండి ఇళ్ళకు తిరిగి వచ్చిన వర్కర్లు 445 00:41:34,995 --> 00:41:37,289 స్థానిక పరిరక్షణ ట్రస్ట్ నేతృత్వంలో 446 00:41:37,372 --> 00:41:41,627 చేపట్టిన ప్రాజెక్ట్ కోసం అవసరమైన అదనపు సాయం చేయగలరు. 447 00:41:43,253 --> 00:41:45,130 లాక్ డౌన్లో మాకో గొప్ప అవకాశం దొరికింది... 448 00:41:45,214 --> 00:41:46,215 మేఘన హజారికా పరిరక్షకురాలు 449 00:41:46,298 --> 00:41:50,010 ...అడవి ఏనుగుల కోసం మొక్కలు నాటడం. 450 00:41:51,803 --> 00:41:54,890 అడవి వెంట, వాళ్ళు కొంత భూభాగంలో వేగంగా పెరిగే 451 00:41:54,973 --> 00:42:00,020 బియ్యం, గడ్డి మొక్కలను ఏనుగులు తినడం కోసం నాటారు. 452 00:42:02,814 --> 00:42:07,402 500 మందికి పైగా కమ్యూనిటీ మొత్తం వచ్చి సహాయం చేశారు. 453 00:42:07,486 --> 00:42:08,529 డులు బోరా పరిరక్షకుడు 454 00:42:09,279 --> 00:42:11,031 కొద్ది నెలల్లోనే, 455 00:42:11,114 --> 00:42:17,329 తమ భూమిలో దాదాపు 400 ఎకరాలను మార్చి, 1.6 చదరపు కిలోమీటర్ల మేర కేటాయించారు. 456 00:42:19,373 --> 00:42:22,459 ఇప్పుడు ఏనుగులను తరిమివేయడానికి బదులుగా 457 00:42:22,543 --> 00:42:25,379 వాటిని స్వాగతిస్తూ వేడుక నిర్వహిస్తున్నారు. 458 00:42:34,346 --> 00:42:36,598 పంటలు కోతకు వచ్చాయి. 459 00:42:38,225 --> 00:42:41,854 అయితే ఏనుగులు వాటి కోసం నాటిన గడ్డిని తింటాయా... 460 00:42:43,897 --> 00:42:46,650 ...లేక రైతుల పొలాలపై దాడి చేస్తాయా? 461 00:42:51,530 --> 00:42:53,532 జనం ఇంటికి వచ్చిన అనంతరం... 462 00:42:54,950 --> 00:42:58,537 అడవి అంచున ఏదో అలజడి మొదలయింది. 463 00:43:06,712 --> 00:43:11,925 ఒకదాని తర్వాత ఒకటిగా, చెట్ల చాటు నుండి ఏనుగులు బయటికి వచ్చాయి. 464 00:43:14,928 --> 00:43:16,263 తల్లులు. 465 00:43:17,764 --> 00:43:19,266 కూనలు. 466 00:43:19,349 --> 00:43:24,354 26 ఆకలిగొన్న ఏనుగుల విస్తారమైన కుటుంబం. 467 00:43:26,690 --> 00:43:28,358 కానీ అవి ఎంతదూరం వస్తాయి? 468 00:43:33,739 --> 00:43:36,575 అడవి అంచు వెంబడే నిలబడి... 469 00:43:38,076 --> 00:43:42,915 వాటికోసం నాటిన మొక్కలను మాత్రమే అవి తినడం మొదలుపెట్టాయి. 470 00:43:46,126 --> 00:43:48,795 గతంలో మేము వాటిని తరిమేసే వాళ్ళం. 471 00:43:48,879 --> 00:43:50,881 కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 472 00:43:50,964 --> 00:43:54,259 ఇది బాగుంది... సంతోషంగా అనిపిస్తోంది. 473 00:43:59,181 --> 00:44:01,767 కోతల కాలం గడుస్తున్న కొద్దీ... 474 00:44:01,850 --> 00:44:06,438 ఏనుగులు రైతుల పొలాల మీదకు రాలేదు 475 00:44:07,064 --> 00:44:08,982 గ్రామంలోకి కూడా రాలేదు. 476 00:44:12,486 --> 00:44:14,613 మనం ఏనుగులను ప్రేమిస్తే 477 00:44:14,696 --> 00:44:17,574 అవి తిరిగి మనల్ని ప్రేమిస్తాయి. 478 00:44:21,203 --> 00:44:22,955 అదనపు భూభాగంలో నాటిన పంట 479 00:44:23,038 --> 00:44:25,165 ఎంతో కాలంగా ఉన్న సమస్యకు దీర్ఘకాల 480 00:44:25,249 --> 00:44:27,459 పరిష్కారం చూపింది. 481 00:44:29,920 --> 00:44:32,005 ఈ పద్ధతిని ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలు 482 00:44:32,089 --> 00:44:36,844 కూడా అవలంబించడం కోసం స్థానిక పరిరక్షణ ట్రస్ట్ ని సంప్రదిస్తున్నాయి. 483 00:44:50,274 --> 00:44:53,026 గత ఏడాదిలోకి వెనుదిరిగి చూస్తే... 484 00:44:53,110 --> 00:44:56,530 మనుషులకు ఎంతో కష్టంగా గడిచినప్పటికీ... 485 00:44:56,613 --> 00:45:01,201 ప్రకృతి ప్రపంచాన్ని, మన భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం... 486 00:45:01,285 --> 00:45:02,911 మనం ఏం నేర్చుకోగలం? 487 00:45:05,622 --> 00:45:09,001 మనం కలిసిమెలిసి ఎలా జీవించాలో ఆలోచించాలి. 488 00:45:10,085 --> 00:45:14,214 వన్యప్రాణులతో మనచోటును పంచుకోవచ్చనే స్పృహ అందరిలో కలిగించాలి. 489 00:45:14,882 --> 00:45:16,508 మనం తిరిగి అవే తప్పుల్ని 490 00:45:16,592 --> 00:45:19,344 చేయకూడదనే జ్ఞానం మనలో కలగాలి. 491 00:45:21,263 --> 00:45:25,184 ప్రకృతి స్పందించిన తీరు, వేగం చూస్తే... 492 00:45:25,267 --> 00:45:29,021 మన జీవితాల్లో చేసే చిన్న చిన్న మార్పులు కూడా... 493 00:45:29,104 --> 00:45:33,650 ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణులలో గొప్ప మార్పును తీసుకొస్తాయని తెలుస్తోంది. 494 00:45:37,487 --> 00:45:41,158 ప్రతి వేసవిలో కొంతకాలం నిషేధం విధించవచ్చు. 495 00:45:41,241 --> 00:45:44,077 రాత్రిళ్ళు బీచుల్ని మూసేయచ్చు. పగలు మూయాల్సిన పనిలేదు. 496 00:45:44,161 --> 00:45:47,039 మనుషులు, జంతువులు కలిసి విజయవంతంగా 497 00:45:47,122 --> 00:45:50,417 బతకడానికి మనుషులు చేసే చిన్న మార్పులు చాలు. 498 00:45:51,627 --> 00:45:54,546 ఓడల్ని నెమ్మదిగా వెళ్ళమని చెప్పొచ్చు, 499 00:45:54,630 --> 00:45:58,342 ఒకే గుంపుగా వెళ్ళడం ద్వారా వాటి ప్రభావం తగ్గించవచ్చు 500 00:45:58,425 --> 00:46:01,428 నీటి అడుగున అవిచేసే శబ్దాలను, తిమింగలాలను రక్షించవచ్చు. 501 00:46:02,304 --> 00:46:05,057 సందర్శకులు, టూర్ గైడ్లు మంచి ప్రవర్తన కలిగి ఉండేలా 502 00:46:05,140 --> 00:46:10,437 వారికి సూచనలు చేయాలని మేము పార్క్ అధికారులను కోరుతున్నాం 503 00:46:10,521 --> 00:46:12,981 అప్పుడే ఈ జంతువుల మనుగడ నిశ్చయమవుతుంది. 504 00:46:14,066 --> 00:46:18,403 ఈ అసాధారణమైన సంవత్సరం, 'భూమి మారిన సంవత్సరం', 505 00:46:18,987 --> 00:46:22,741 వన్యప్రాణులు అభివృద్ధి చెందేందుకు మనం సాయం చేయగలమని మాత్రమే కాక, 506 00:46:23,534 --> 00:46:25,661 మనం తలచుకుంటే, 507 00:46:26,245 --> 00:46:30,165 ఈ గ్రహాన్ని ఆరోగ్యకరంగా కూడా మార్చగలమని తెలియజేస్తోంది. 508 00:46:31,375 --> 00:46:33,544 ఇప్పటికీ సమయం మించిపోలేదు 509 00:46:33,627 --> 00:46:37,965 కాలుష్యం తగ్గించడానికి మనం ఎంత వీలైతే అంత తోడ్పాటు అందించాలి. 510 00:46:38,715 --> 00:46:42,302 సహజ ప్రపంచానికి దూరంగా కాకుండా... 511 00:46:44,096 --> 00:46:48,725 మన జీవితాలు లోతుగా, ఆశ్చర్యకరమైన రీతుల్లో ఒకదానితో ఒకటి 512 00:46:48,809 --> 00:46:51,311 ముడిపడి ఉన్నాయని తెలుసుకున్నాం. 513 00:46:53,355 --> 00:46:55,816 మనం భవిష్యత్తులో మనగలగాలంటే, 514 00:46:55,899 --> 00:46:58,902 మన గ్రహాన్ని మనతో పాటు భూమ్మీది ప్రాణులన్నింటితో 515 00:46:59,736 --> 00:47:02,573 పంచుకునే పద్ధతులను కనిపెట్టేందుకు... 516 00:47:04,491 --> 00:47:06,869 ఇదే సరైన సమయం. 517 00:48:11,517 --> 00:48:13,519 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ